![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -354 లో... కావ్య, భాస్కర్ ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటే రాజ్ దూరంగా ఉండి చూస్తూ జెలస్ ఫీల్ అవుతాడు నీ మనసులో కావ్యపై ఉన్న ప్రేమని భయటపెట్టని రాజ్ అంతరాత్మ చెప్తుంది. నాకు కావ్యపై ప్రేమ లేదు అలాంటప్పుడు ఎలా చెప్తానని రాజ్ అంటాడు. ఇలాంటి ప్రేమ లేకుంటే ఎందుకు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అలా చూస్తున్నావని అంతరాత్మ రాజ్ ని అడుగుతుంది. తన అంటే ఇష్టం లేదు నేను జలస్ గా ఫీల్ అవడం లేదని రాజ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య, భాస్కర్ ఇద్దరు వస్తారు. మా బావకి మీ సూట్ కావాలని రాజ్ ని కావ్య అడుగుతుంది. సూట్ ఏంటి ఏది అవసరం ఉంటే అది తీసుకొని వెళ్ళు.. నువు మీ బావ బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి రండి అంటూ రాజ్ కార్ కీస్ ఇస్తుంటే కావ్య, భాస్కర్ లు ఆశ్చర్యంగా చూస్తారు. మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి కలిసి మాట్లాడాలని అంటాడు. నేను రానని అప్పు అనగానే నాకు ఇప్పుడు కష్టం వచ్చింది ఫ్రెండ్ గా నీతో షేర్ చేసుకోవడానికి రమ్మని చెప్తున్నానని నువు కచ్చితంగా వస్తున్నావంటూ కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తాడు. కళ్యాణ్ మాటలు అనామిక వింటుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు కలుస్తున్నావంటూ అడుగుతుంది. నా ఫ్రెండ్ కాబట్టి నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి తను.. నేను కచ్చితంగా కలుస్తానని అనామికకి కళ్యాణ్ చెప్తాడు. మరొక వైపు నా ఫ్రెండ్ కి కష్టం వచ్చింది అంటే వెళ్లకుండా ఎలా ఉంటానని కనకంతో అప్పు అంటుంది. ఆ తర్వాత రాజ్ ఇలా రివర్స్ అయ్యాడేంటని కావ్య, భాస్కర్ ఇందిరాదేవీలు అనుకుంటారు.
ఆ తర్వాత అనామిక ఏడుస్తూ ఉంటే ధాన్యలక్ష్మి వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఇంట్లో అందరికి ఇలా ఆస్తులు రాస్తు పోతే చివరికి మన పరిస్థితి ఏంటని అనామిక అంటుంది. ఆ విషయం నేను చూసుకుంటాను. నువు కళ్యాణ్ తో ప్రేమగా ఉండు.. వాడు హాల్లో పడుకోవడం చూసానని ధాన్యలక్ష్మి అంటుంది. నేను ఉండాలనే ప్రయత్నం చేస్తున్న కానీ మీ అబ్బాయే నన్ను హర్ట్ చేస్తున్నాడు. అప్పుతో మాట్లాడుతున్నాడని అనామిక చెప్తుంది. అవునా నేను చూసుకుంటాను కానీ రెడీ అయ్యిరా బయటకు వెళ్దామని అనామికతో ధాన్యలక్ష్మి చెప్తుంది. తరువాయి భాగంలో కావ్యకి తన బావతో అమెరికా వెళ్ళమని రాజ్ వీసా తీసుకొని వచ్చి ఇస్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏదో డ్రామా చేస్తుంటే మీ మనవడు నిజంగానే వీసా తెచ్చాడు అని ఇందిరాదేవికి కావ్య చెప్తుంది. ఇక చివరి అస్త్రం వదలాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |